దేశ రాజధానిలో ఘనంగా బోనాల ఉత్సవాలు..

424
bonalu
- Advertisement -

దేశ రాజధానిలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మ వారి ఆలయ కమిటీ సంయుక్తంగా ఈ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బోనాల ఉత్సవాల్లో ఎంపీలు నామా, రాములు, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్, తెలంగాణ భవన్ అధికారులు పాల్గొన్నారు.

ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఊరేగింపుగా సాగిన అమ్మవారి యాత్ర జరిగింది.అనంతరం తెలంగాణ భవన్‌లో ఘట స్థాపన చేపట్టారు. ఊరేగింపులో జోగిని రాకేష్ బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బోనాల ఊరేగింపు కళాకారుల డప్పు చప్పులు, ఒగ్గు నృత్యాల మధ్య ఆద్యాంతం వైభవంగా సాగింది.

అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలతో పాటూ, దేశ ప్రజలకు దక్కాలి. సిఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చాటిచెప్పారని.. ఆయన ఆయురారోగ్యలతో, మరింత కాలం సిఎంగా రాష్ట్రానికి సేవ చేయాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నాం.సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పండుగలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు.అన్ని మతాలను, పండుగలను గౌరవించే సంస్కృతి తెలంగాణ ప్రజలది. అని తెలంగాన ఎంపీలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపేలా ఢిల్లీలో బోనాల పండుగను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ సహకారంతోనే దేశ రాజధానిలో ఇంత ఘనంగా బోనాల పండుగ నిర్వహించగలుగుతున్నాం. ఐదు సంవత్సరాలుగా ఢిల్లీలో లాల్ దర్వాజ అమ్మవారి బోనాల పండుగ నిర్వహించడం మా అదృష్టం. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే ఢిల్లీలో అమ్మ వారికి బంగారు బోనం ఎత్తుతామని మొక్కుకున్నాం. అందుకే రాష్ట్ర అవతరణ మొదలు ఇప్పటి వరకు ప్రతి యేటా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాం. లాల్ దర్వాజ అమ్మవారి ఆశీస్సులు సిఎం కేసీఆర్, రాష్ట్ర ప్రజలకు ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. రాష్ట్ర పండుగను విశ్వ వ్యాప్తం చేయాలన్నదే మా కోరిక అని లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మ వారి ఆలయ కమిటీ నిర్వహకులు అన్నారు.

- Advertisement -