Telangana BJP: తెలంగాణ బీజేపీలో అదే గందరగోళం

9
- Advertisement -

తెలంగాణలో బీజేపీది ప్రేక్షకపాత్రేనా?, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజా సమస్యలపై స్పందించే ప్రజాప్రతినిధులే కరువయ్యారా?, దీనంతటికి కారణం బీజేపీలో అంతర్గతపోరేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఇప్పటికే నేతల మధ్య సమన్వయలోపంతో కాషాయ పార్టీలో నేతలంతా సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా అధ్యక్ష ఎన్నికలు ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తుండగా ఇప్పుడు రాష్ట్ర ఇంఛార్జీ విషయంలోనే అదే గందరగోళం నెలకొంది.

తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌నని కర్ణాటకకు చెందిన బీజేపీ నేత అభయ్ పాటిల్ ప్రకటించుకోగా ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దానిని ఖండించారు. అయితే కిషన్ మాటలను పట్టించుకోని అభయ్ పాటిల్, తెలంగాణ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఇదే కిషన్ రెడ్డి కోపానికి కారణమైంది.

తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ గా జాతీయ నాయకత్వం ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదంటూ కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనంతటికి కారణం అభయ్ ముక్కుసూటి తనమేనట. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నికల ఇంచార్జ్‌గా తెలంగాణలో పనిచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామనుకున్న భువనగిరి, జహీరాబాద్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో ఓడిపోయిన తీరుపై ఆయన స్థానిక సీనియర్ నేతలను సమావేశంలోనే నిలదీశారంట. ఈ విషయంలో కిషన్ రెడ్డి చెప్పిన వినకపోవడంతో ఇప్పుడే ఇదే ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైందట. మొత్తంగా బీజేపీ గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించినప్పటికి సమన్వయ లోపం కారణంతో ఇప్పుడే కాషాయ పార్టీలో కల్లోలం సద్దుమణిగేలా కనిపించడం లేదు.

Also Read:కృష్ణాష్టమికి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్

- Advertisement -