బీజేపీ టికెట్ల లొల్లి.. షురూ!

73
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో బరిలో నిలిచే అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే అధికార బి‌ఆర్‌ఎస్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీద ఉండగా.. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థుల ఎంపిక తర్జన భర్జన పడుతునే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారిలో అసలైన వారిని జల్లెడపట్టే పనిలో ఉంది. ఇక బీజేపీ విషయానికొస్తే.. పార్టీలో అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. అసలే పార్టీ బలం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో నియోజిక వర్గాల వారీగా బరిలో నిలిచే అభ్యర్థుల జాడే కనిపించడం లేదు. .

దీంతో ఒకవైపు నుంచి ఎలక్షన్స్ ముంచుకొస్తుండడంతో కాషాయ పెద్దలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ పరిస్థితి అధోగతి అవుతుందనే భయంతో కాంగ్రెస్ మాదిరిగానే దరఖాస్తులకు తెర తీసింది. ఈ నెల 4 నుంచి 10 వరకు ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనుంది బీజేపీ అధిష్టానం. అంతే కాకుండా దరఖాస్తుల పరిశీలనకు స్క్రినింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనుకడుగు వేస్తున్నారు. పార్టీలో ఉన్న అరకొర నేతలు కూడా ఎప్పుడెప్పుడు పార్టీ విడదామా అనే ఆలోచనలో ఉన్నారట. ఇందుకంటే ఇటీవల బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయిన నేపథ్యంలో ఎవరికి సీటు దక్కుతుంది ఎవరికి దక్కదు అనే క్లారిటీ కూడా కమలనాథుల్లో కరువైనట్లు తెలుస్తోంది. మరి కమలం పార్టీ తరుపున బరిలో నిలిచే అభ్యర్థులేవరు వారు ఎంతవరుకు పార్టీలో కొనసాగుతారనేది ప్రశ్నార్థకమే.

Also Read:చెప్పడం మాత్రమే.. చేయడం ఉండదా ? మోడీజీ !

- Advertisement -