BJP:మూడో జాబితా రిలీజ్

37
- Advertisement -

తెలంగాణ బీజేపీ థర్డ్ లిస్ట్ రిలీజైంది. మొత్తం 35 మందితో బీజేపీ మూడో లిస్ట్‌ని రిలీజ్ చేయగా ఇందులో ఎస్సీ 5, 3 ఎస్టీలకు చోటు కల్పించారు. ఇక ఇప్పటికే తొలి రెండు జాబితాల్లో 53 మందిని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక సీనియర్లు అంతా పోటీకి దూరం కాగా అంబర్ పేట నుండి కిషన్ రెడ్డి సైతం బరిలో దిగడం లేదు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్‌కు అంబర్ పేట సీటు దక్కింది. అందోల్‌ నుంచి బాబుమోహన్‌, బాన్సువాడ నుంచి యెండల లక్ష్మీనారాయణ, ఉప్పల్‌ నుంచి ఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌కు చోటు దక్కింది. అయితే బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాబు మోహన్‌కు అందోల్ సీటు దక్కగా ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read:KTR:టాలెంట్‌ ఉంటే ఏదైనా సాధించొచ్చు

- Advertisement -