Bandi Sanjay:మళ్ళీ బండినే..ఈసారి డౌటే?

50
- Advertisement -

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేసిన బీజేపీ ఎన్నికల ముందు మాత్రం ఎవరు ఊహించని రీతిలో డీలా పడింది. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా వంటి జాతీయ నేతలు ప్రచారం చేసినప్పటికీ ఫలితం మాత్రం కనిపించలేదు. కనీసం డబుల్ డిజిట్ సీట్లు కూడా సొంతం చేసుకోలేక చేతులెత్తేసింది. మరి బీజేపీ ఈ స్థాయిలో పరాభవం మూటగట్టుకోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీలోని అంతర్గత లొసుగులే అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతకు ముందు పార్టీని బలపరుస్తూ వచ్చిన బండి సంజయ్ ని అనూహ్యంగా ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ తరువాత బాద్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి ఆశించిన స్థాయిలో పార్టీకి మైలేజ్ తీసుకురాలేకపోయారు. .

పైగా మాజీ అధ్యక్షుడుగా ఉన్న బండి పూర్తిగా సైలెంట్ గా ఉండడం, ఈటెల రాజేందర్ వంటి వారు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోవవడంతో ఎన్నికల్లో బీజేపీ కంప్లీట్ గా డీలా పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో పార్టీని పునః నిర్మించే పనిలో ఉంది అధిష్టానం. మరోసారి బండి సంజయ్ కి అధ్యక్ష బాద్యతలు అప్పగించేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బండి సంజయ్ ఈసారి అధ్యక్ష పదవికి సుముకత చూపుతారా లేదా అనేది సందేహమే. ఎందుకంటే తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తరువాత తీవ్ర అసహనం చూపుతూ వచ్చారు. అంతే కాకుండా ఈసారి అధ్యక్ష పదవి ఇస్తే తనకు వద్దని ఆల్రెడీ బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు కూడా. ఈ నేపథ్యంలో అధిష్టానం కోరిక మేరకు బండి మరోసారి ఆ పదవి అధిష్టిస్తారా అనేది సందేహమే. అయితే ఈసారి అధ్యక్ష పదవి రేస్ లో ఈటెల కూడా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోసారి రాష్ట్ర బీజేపీలో మార్పులు ఎలాంటి పరిణామాలకు తావిస్తాయో చూడాలి.

Also Read:రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -