బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో..వీరే!

10
- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. జులై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ నెల 29న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. 30న నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల ఎంపిక పూర్తికాగా.. మిగిలిన రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై బీజేపీ దృష్టి సారించింది. పార్టీ నేతల విషయంలో పాత, కొత్త అనే తేడాలు ఉండబోవని లక్ష్మణ్ చెప్పడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది.

ప్రధానంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఎంపీ ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్ సహా పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఎవరికి వారే తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ వెలువడటంతో బీజేపీ శ్రేణుల్లో ఈ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.

Also Read:బొమ్మరిల్లు తర్వాత 3 బీహెచ్‌కే !

అయితే ఇప్పటికే బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎవరికి అధ్యక్ష పదవికి దక్కినా మిగితా వారు సహకరిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -