వామ్మో.. ఇన్ని డ్రామాలా !

43
- Advertisement -

పిల్లి ఇరకాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుంది తెలంగాణలోని బీజేపీ కాంగ్రెస్ పార్టీల పరిస్థితి. బి‌ఆర్‌ఎస్ ను ఎలాగూ ఎదుర్కొలేమని భావించిన ఈ రెండు పార్టీల నేతలు లేని నిజాన్ని ఉందని నిరూపించేందుకు మసిపూసి మారేడు కాయ చేస్తున్నాయి. అబద్దాన్ని నిజంలా చూపించి బి‌ఆర్‌ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు నానా పన్నాగలు పన్నుతున్నాయి. అయితే అవన్ని ఆ రెండు పార్టీలు ఆడుతున్న డ్రామాలు అనే సంగతి తెలియంది కాదు..

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కే‌సి‌ఆర్ రూ. 25 కోట్లు ఇచ్చారని బీజేపీ నేత ఈటెల రాజేంద్ర ఇటీవల ఆరోపణలు గుప్పించారు. దీనికి కాంగ్రెస్ అబ్బే అలాంటిదేమీ లేదని చెబుతూనే వార్తల్లో హైలెట్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ చేసిన ఈ నిరాధార ఆరోపణకు కాంగ్రెస్ రియాక్ట్ అవుతున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించక మానదు. రేవంత్ రెడ్డి అమ్మవారిపై ప్రమాణం చేయడం, కన్నీరు కార్చడం, దానికి బీజేపీ నేతల నుంచి ఓదార్పు వినిపించడం చూస్తే.. అతి రహస్యం బట్టబయలు అన్నట్లుగా ఈ రెండు పార్టీల మద్య ఉన్న రహస్యబంధం ఇట్టే అందరికీ అర్థమౌతుంది.

Also Read:మోదీకి ఫ్రెండ్‌ ఫస్ట్‌.. నేషన్‌ లాస్ట్‌: కేటీఆర్ ఫైర్

మొదట రేవంత్ రెడ్డి 25 కోట్లు తీసుకున్నారని విమర్శించిన ఈటెల.. ఇప్పుడేమో అలా అనలేదని, తానన్నది కాంగ్రెస్ పార్టీని అని తలతోక లేని సమాధానం చెబుతున్నారు. ఈ రెండు పార్టీల తీరు గమనిస్తున్న రాజకీయ వాదులు.. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న పబ్లిసిటీ స్టంట్ అని కొట్టి పారేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ పై బురద చళ్ళేందుకే ఈ ప్రయత్నాలు అనే సంగతి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. ఏరకంగానైనా కే‌సి‌ఆర్ ను ఇరకాటంలో పెట్టి రకాకీయ లబ్ది పొందేందుకు ఈ రెండు పార్టీలు విశ్వ ప్రయత్నలు చేస్తునాయనేది జగమరిగిన సత్యం.

Also Read:రేవంత్ కన్నీరుకు కారణం కాంగ్రెసే ?

- Advertisement -