తెలంగాణలో ఎన్నికలకు మరో వారం రోజుకు కూడా లేనప్పటికి బీజేపీలో మాత్రం చలనం రావడం లేదు. ఇతర పార్టీలు ప్రచారలతో హోరెత్తిస్తుంటే కమలనాథులు మాత్రం పార్టీని గాలికి వదిలేసి చేతులెత్తేశారు. దీంతో కమలం పార్టీ ఆల్రెడీ ఓటమిని ఒప్పుకుందా అనే డిబేట్లు జరుగుతున్నాయి. ఆ మద్య అధికారం మాదే అని తెగ హడావిడి చేసిన కమలనాథులు తీర ఎన్నికల సమయానికి అందరూ సైలెంట్ అయ్యారు. పార్టీ అగ్రనేతలు తరచూ రాష్ట్రానికి వస్తున్నప్పటికి పార్టీలో పరిస్థితులు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా ప్రస్తుతం అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న కిషన్ రెడ్డి ఇంతవరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయంలో ఇప్పటికే మేనిఫెస్టో మరియు అభ్యర్థుల ప్రకటన జరిగినప్పటికీ వాటి గురించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కిషన్ రెడ్డి దారుణంగా ఫెయిల్ అయ్యాడని ఆ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారట. .
గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో బీజేపీలో ఎంతో కొంత హడావిడి కనిపించేది. కానీ కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఉన్న కొద్దిపాటి హడావిడి కూడా కమలం పార్టీలో కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా క్షీణిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీజేపీ ఈ స్థాయిలో పతనం కావడానికి కిషన్ రెడ్డి ఒక కారణం అయితే బండి సంజయ్ కూడా మరో కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా పార్టీ ధీన స్థితికి చేరుకుందని కమలం పార్టీలోనే ఓ వర్గం చెబుతోంది.
అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తరువాత బండి సంజయ్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు తనది బీజేపీనే కాదు అన్నట్లుగా పార్టీకి అంటీ అంటనట్టు వ్యవహరిస్తున్నారు. ఇక కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికి తనకంటే ఎక్కువగా ఈటెల, బండి సంజయ్ వంటి వారికి అధిష్టానం అధిక ప్రధాన్యం కలిపిస్తుండడంతో ఆయన కూడా నామమాత్రపు అధ్యక్షుడిగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోవడం కూడా కిషన్ రెడ్డి నిర్లక్ష్యానికి కారణమనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి అధ్యక్షుడు మరియు మాజీ అధ్యక్షుడు ఇద్దరు కూడా బీజేపీ పతనానికి కారణమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
Also Read:Bhumana:విద్యను నిర్లక్ష్యం చేస్తే జీవితం అంధకారమే