తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు

133
- Advertisement -

బీఆర్ఎస్ ఏర్పడిన సందర్భంలో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంతోపాటు జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్‌ రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మార్పు చెందడమే కాకుండా 60లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలను కలిగి ఉన్న ఏకైక పార్టీగా బీఆర్‌ఎస్ ఆవతరించింది. తెలంగాణను ఏవిధంగానైతే అభివృద్ధి చేసుకున్నామో అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు నడుం బిగిద్దాం అని సీఎం కేసీఆర్‌ దసరా సందర్భంగా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి కుమారస్వామి

పవన్ కళ్యాణ్ కు వారాహి చిక్కులు…

రెండోదశ మెట్రోకు శంకుస్థాపన

- Advertisement -