- Advertisement -
తెలంగాణ బెనిఫిట్ షోల రద్దుపై మరోసారి క్లారిటీ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. బెనిఫిట్ షోలకి అనుమతి లేదంటూ తెలిపింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం.. అర్థరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 వరకు గల మధ్య సమయంలో ఎలాంటి ప్రత్యేక షోలకు అనుమతి లేదని.. ఈ చట్టాన్ని పాటించాలని న్యాయస్థానం ఆదేశించింది
సినిమా టికెట్ ధరల పెంపు , స్పెషల్ షోలకు సంబంధించిన పిటిషన్‌కి సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరుగగా.. ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదనాలు వినిపిస్తూ.. సంక్రాంతి సమయంలో సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు.
ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.
Also Read:క్రాప్ లోన్ కింద కళ్యాణలక్ష్మీ డబ్బులా?: కేటీఆర్
- Advertisement -