బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తాం అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి అని… బీసీలందరూ కలిసికట్టుగా ఉద్యమించే సమయం ఆసన్నమైంది అన్నారు. రిజర్వేషన్లు సాధించడం కోసం ఎంతకైనా పోరాడతాం… 42 శాతం బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమైనది, చట్టబద్ధమైనది, న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది అన్నారు. దయజేసి దీనికి ఎవరూ అడ్డు రావొద్దు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 అల్లాటప్పా జీవో కాదు రాజ్యాంగం ప్రకారం వచ్చిన జీవో అన్నారు. రాజ్యాంగం ప్రకారం బీసీ రిజర్వేషన్‌లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది… గతంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో చట్టం చేశారు…డెడికేటెడ్ కమిషన్ వేశారు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జనాభా లెక్కలు నిర్వహించారు… జీవో 9 వెనుక బలమైన, హేతుబద్ధమైన బేసిక్స్ ఉన్నాయి అన్నారు. బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు స్టే ఇవ్వడానికి బలమైన కారణాలు లేవు అన్నారు.
Also Read:TTD:12 నుండి పవిత్రోత్సవాలు

