ప్రజల హృదయాల్లో సాయన్న,లాస్య నందిత

15
- Advertisement -

కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్య నందిత చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభ సమావేశాల ప్రారంభం అనంతరం కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి సంతాపంగా తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

ఇలాంటి తీర్మానం ఒకటి ప్రవేశపెట్టాల్సి వస్తుందని తాను ఊహించలేదని , లాస్య తండ్రి సాయన్న తనకు అత్యంత ఆప్తుడని, చాలా ఏళ్లు కలిసి పనిచేశామని తెలిపారు. సాయన్న వారసత్వాన్ని అందిపుచ్చుకున్న లాస్య నందిత దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని…వారు చేయాలనుకున్న పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.

సాయన్న అజాత్ర శత్రువని, కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిన్న వయస్సులోనే లాస్య నందిత మృతిచెందడం తమను దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ఒకటే ఏడాదిలో తండ్రి,కూతరు చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు అన్నారు. కంటోన్మెంట్‌లో రాజకీయాలకు అతీతంగా సాయన్న సేవలు అందించారన్నారు. సాయన్న వారసురాలిగా లాస్య నందిత సైతం భారీ మెజార్టీతో గెలిచారని గుర్తుచేశారు కేటీఆర్. లాస్య నందిత మృతికి సంతాపంగా స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేశారు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్.

Also Read:Union Budget 2024-25: కేంద్రబడ్జెట్ హైలైట్స్

- Advertisement -