TS Assembly:ఇవాళ ప్రవేశపెట్టే బిల్లులివే

49
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ సభలో కీలక బిల్లులను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఏడు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుండగా నాలుగు బిల్లులు గతంలో ఉభయ సభలలో చర్చించి ఆమోదించి గవర్నర్ సంతకం కోసం పంపితే.. వెనక్కి వచ్చిన బిల్లులు ఉన్నాయి. అలాగే రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. రాష్ట్రంలో అధిక వర్షపాతంవల్ల కలిగే ఇబ్బందులు ,విద్య, వైద్య రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతిపై చర్చ జరగనుంది.

సభలో ప్రవేశపెట్టే బిల్లులు..

()ది తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బిల్ 2023 ను ప్రవేశపెట్టనున్న ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు.

()ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2023ను ప్రవేశపెట్టనున్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి.

()తెలంగాణ మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లు 2023ను ప్రవేశపెట్టనున్న మంత్రి కొప్పుల ఈశ్వర్.

() తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు 2022‌ను రీ కన్సిడరేషన్కోసం సభలో ప్రవేశ పెట్టనున్న మంత్రి కేటీఆర్.

() తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు-2022 రీకన్సిడరేషన్ కోసం సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు.

Also Read:Sushanth:మెగాస్టార్‌తో నటించడం నా అదృష్టం

()తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ – 2022ను సభలో రికన్సిడరేషన్‌కోసం ప్రవేశపెట్టనున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

()తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు – 2023ను రిఫరెన్స్ కోసం సభలో ప్రవేశపెట్టనున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

- Advertisement -