29 నుండి అసెంబ్లీ సమావేశాలు

13
- Advertisement -

ఈనెల 29వ తేదీ నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో సమావేశాలు జరగవు.

మళ్ళీ జనవరి 2వ తేదీ నుంచి కొనసాగనున్నాయి శాసనసభ సమావేశాలు. గోదావరి కృష్ణా జలాల అంశం ఎజెండాగా సమావేశాలు కొనసాగనున్నాయి.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి వాటాలు, కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను శాసనసభ సమావేశాల సందర్భంగా చర్చ జరగనుంది.

అలాగే నీటిపారుదల అంశాలపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎండగట్టాలని ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన మంత్రుల భేటీలో సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Also Read:రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీస్తారా?

- Advertisement -