మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు!

16
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది . 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉండనుండగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది.

అలాగే ఎస్సీ ఉప వర్గీకరణకు చట్టబద్ధతపై , బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు,విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా మరో బిల్లు.. ఇలా మూడు బిల్లులను ప్రభుత్వం సిద్దం చేయనున్నట్టుగా తెలుస్తోంది.

ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టనుంది బీఆర్ఎస్. రైతు, గురుకులాల సమస్యలతో పాటు కులగణన తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.

Also Read:తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్

- Advertisement -