- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. 14న హోలీ సందర్బంగా అసెంబ్లీకి సెలవు కాగా 15వ తేదిన ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది.
16వ తేదిన ఆదివారం అసెంబ్లీకి సెలవు కాగా 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ జరగనుంది. 18న బీసీ కుల గణన, రిజర్వేషన్లపై చర్చ జరగనుండగా 19న 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవెశపెట్టనుంది ప్రభుత్వం.
20న అసెంబ్లీకి సెలవు కాగా 21వ తేది నుంచి బడ్జెట్ పై చర్చ జరగనుంది. 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.
Also Read:కాంగ్రెస్ వైఖరిని నిలదీయండి: కేసీఆర్
- Advertisement -

