తెలంగాణ అసెంబ్లీ, పోచారం తప్ప మిగితావారు డుమ్మా

19
- Advertisement -

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. తొలుత కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం ప్ర‌క‌టించింది. ఇక బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 10 ఎమ్మెల్యేల్లో ఒక్క పోచారం మాత్రమే సభకు హాజరయ్యారు.

శాస‌న‌స‌భ ముగిసిన వెంట‌నే బీఏసీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో అసెంబ్లీ నిర్వ‌హ‌ణ తేదీల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. ప‌ది రోజుల పాటు స‌భ‌ను నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

ఈ నెల 25న బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ‌పెట్ట‌నుండగా అదే రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ భేటీ అయి రాష్ట్ర బ‌డ్జెట్‌కు ఆమోదం తెలుప‌నున్నారు.

Also Read:ఈసారి కూడా ‘పేపర్ లెస్’ బడ్జెట్

- Advertisement -