- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న దృష్ట్యా కరోనా నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -