తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానుండగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ తదితర అంశాలపై చర్చ జరగనుంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 15 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 17న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉండగా పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ వంటివాటిని మార్చి రెండో వారంలో చేపడతారని తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాల తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇదే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ఒక రోజు ముందుగాని, వెనుక గాని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
Also Read:తెలంగాణకు కేంద్రం ఇచ్చంది గుండు సున్నా!

