- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 22 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ డబ్బును క్లెయిమ్ చేసుకునేందుకు ముందుకు రాలేదు యజమానులు. బినామీ యాక్ట్ కింద రూ.22 కోట్ల రూపాయల నగదు సీజ్ చేసింది ఐటీ.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. నవంబర్ 2023లో గచ్చిబౌలిలో ఐదు కోట్లు సీజ్ చేసింది ఐటీ.2023 జూన్ లో మూడు కోట్లు సీజ్ చేశారు అధికారులు.
మొత్తం తొమ్మిది కేసుల్లో రూ. 22 కోట్లు సీజ్ చేయగా బాచుపల్లి, గచ్చిబౌలి, హయత్ నగర్, కవాడిగూడా, కాచిగూడల్లో పట్టుబడింది కోట్ల రూపాయల డబ్బు. అయితే ఈ డబ్బును తీసుకునేందుకు ఎవరు ముందుకురాకపోవడం విశేషం.
Also Read:గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నా: చంద్రబాబు
- Advertisement -

