నేటితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు..

42
kcr
- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మొత్తంగా 37 ప‌ద్దుల‌కు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. ఇక ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ, మండ‌లిలో చర్చ జ‌ర‌గ‌నుంది.

అనంతరం ఎఫ్ఆర్ఎంబీ, మార్కెట్ క‌మిటీల చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ల బిల్లుల‌పై మండ‌లిలో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈరోజు ఉభ‌య స‌భ‌ల్లో ప్రశ్నోత్తరాల‌ను ర‌ద్దు చేశారు. కాగా ఈరోజు బడ్జెట్ సమావేశాల చివరి రోజు కానున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు.

అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేషన్, ప్రతిపక్షాలకు కౌంటర్, బడ్జెట్ అంశాలపై ప్రస్తావించనున్నారు. దాదాపు రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -