తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌ం..

378
Telangana Assembly
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ స‌మావేశాల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రులు హాజ‌ర‌య్యారు. స‌మావేశాల‌ను రెండు వారాల పాటు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగం ప్రారంభించారు. ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే రేప‌టికి స‌మావేశాలు వాయిదా పడతాయి.

అనంత‌రం స్పీక‌ర్ పోచారం అధ్య‌క్ష‌త‌న బీఏసీ స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. రేపు దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల స‌భ‌లో సంతాప తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఎల్లుండి గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఈ నెల 18న అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి హ‌రీష్‌ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల‌ 19వ తేదీన సెలవు ఉంటుంది.ఆ త‌దుప‌రి రోజు నుంచి బడ్జెట్‌పై చర్చలు ప్రారంభ‌మ‌వుతాయి.

- Advertisement -