ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం

23
- Advertisement -

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం తెలిపింది. ఇక బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన వేముల ప్రశాంత్ రెడ్డి.. రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ప్రకారం ” ఆయా రాష్ట్రాలు S. C వర్గీకరణ చేసుకోవచ్చు” అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన S. C వర్గీకరణ బిల్లును సంపూర్ణంగా సమర్తిస్తున్నాం అన్నారు.

న్యాయమైన SC వర్గీకరణకు BRS పార్టీ మొదటి నుండి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని… మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా KCR గారు వర్గీకరణ అంశానికి మొదటి నుండి సంపూర్ణ మద్దతు తెలిపారు.TRS పార్టీ ఉద్యమం నుండి పుట్టిన పార్టీ కాబట్టి స్వయంగా KCR గారు ఒక అస్తిత్వ ఉద్యమ నాయకుడిగా వర్గీకరణ అంశంలో మందకృష్ణ మాదిగ గారి తో పాటు అనేక ఇతర సంఘాలు,సంస్థలు, వ్యక్తులు,మేధావులు చేసిన పోరాటాన్ని,ఉద్యమాన్ని అర్థం చేసుకొని వారి కార్యాచరణకు ఎల్లప్పుడూ KCR అండగా నిలబడ్డారు అన్నారు.

మాదిగలను కేవలం ఓటు బ్యాంకు గా చూసే కొన్ని రాజకీయ పార్టీల అవకాశవాదానికి భిన్నంగా BRS పార్టీ , KCR గారు అధికారం లో ఉన్నా లేకున్నా ఉద్యమం నుండి ఈ రోజు దాకా సుమారు 25 సం౹౹లుగా ఈ SC వర్గీకరణ అంశంలో ఒకే స్టాండ్ తీసుకొని మద్దతు అందించారు,అందిస్తూనే ఉన్నాం.ఇచ్చిన మాటకు కట్టుబడి,BRS అధికారంలో వచ్చిన వెంటనే 29 నవంబర్ 2014 లోనే S.C వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మా నాయకుడు కేసీఆర్ అన్నారు .

అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారిని స్వయంగా కలిసి తీర్మాణం కాపీలను అందజేసి రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ఆ తర్వాత మోడీ ప్రభుత్వ నాన్చివేత ధోరణి ని నిరసిస్తూ S.C వర్గీకరణ అంశంలో వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలంటూ BRS M.P లు అనేక సార్లు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తదనంతరం సుప్రీం కోర్టు కు S.C వర్గీకరణ అంశం చేరితే సుప్రీం కోర్టులో ఉన్న వర్గీకరణ కేసులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ అయి అనుకూల వాదనలు వినిపించడం జరిగిందన్నారు.

Also Read:సునీతా విలియమ్స్‌కు ప్రధాని లేఖ

S.C వర్గీకరణ పూర్తి అయితే స్థానిక సంస్థల్లో మాదిగలకు రాజకీయ అవకాశాలు పెరుగుతయి.. కాబట్టి S. C వర్గీకరణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని BRS పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. S. C వర్గీకరణ బిల్లుకు మా నాయకుడు KCR గారి ఆదేశాల మేరకు BRS పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని తెలియజేస్తున్నాము అని తెలిపారు ప్రశాంత్ రెడ్డి.

- Advertisement -