అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

91
telangana
- Advertisement -

అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు కొనసాగిన సమావేశాల్లో ప్రభుత్వం ఏడు సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఐదు రోజుల విరామం అనంతరం శాసన సభ సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే భూపాతి రావు మృతి పట్ల అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. రెండో రోజు అసెంబ్లీ, మండలి.. సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్ చేశారు. మంత్రులు ఏడు చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపెట్టారు. అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, తెలంగాణ మున్సిపల్ లాస్ చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశపెట్టగా… తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును విద్యా శాఖ మంత్రి సబిత పెట్టారు. అలాగే తెలంగాణ మోటర్ వెహికిల్స్ టాక్సేషన్ బిల్లును ట్రాన్స్ పోర్ట్ మంత్రి పువ్వాడ అజయ్ ప్రవేశపెట్టగా… వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణ బిల్లును ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు.

- Advertisement -