ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ : సీఎం కేసీఆర్

310
cm kcr
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 503కు చేరాయని తెలిపారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతొ మట్లాడిన సీఎం…ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. 14 మంది చనిపోయారని వెల్లడించారు. 96 మంది డిశ్చార్జ్‌ అయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 393 అని తెలిపారు. ఇందులో ఇతర దేశాల నుండి వచ్చిన వారు కూడా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని తెలిపారు. తొలిదశలో విదేశాల నుండి వచ్చిన వారంతా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. లాక్ డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 103,ఇతర ప్రాంతాల్లో 120 మొత్తం 220 కంటైన్‌మెంట్ ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ఏప్రిల్ 24 వరకు తెలంగాణ ఫ్రీగా స్టేట్ అవుతుందని చెప్పారు.

- Advertisement -