స్టేట్‌ డైరీ చైర్మన్‌గా సోమా భరత్‌…

279
- Advertisement -

తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్.. చైర్మన్ గా సోమా భరత్ కుమార్ ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో సోమా భరత్ కుమార్ ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.

ఈ నియామక ఉత్తర్వును సీఎం కేసీఆర్ చేతులమీదుగా సోమవారం ప్రగతి భవన్ లో కలిసి అందుకున్న భరత్ కుమార్, తనకు అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్ కి కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సోమా భరత్‌కు శుభాకాంక్షలు తెలిపి, అభినందించి, ఆశీర్వదించారు.

ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోమా భరత్ కుమార్ (62). తెలంగాణ స్టేట్‌ డైరీ డెవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. భరత్‌ వ్యక్తిగత జీవితం… సూర్యాపేట జిల్లా, తుంగతూర్తి నియోజకవర్గం, వర్థమానుకోట గ్రామ వాస్తవ్యుడైన, వైశ్య సామాజిక వర్గానికి చెందిన సోమా భరత్ కుమార్ వృత్తి రీత్యా ప్రముఖ సీనియర్ అడ్వకేట్ గా సేవలందిస్తూ పేరు గాంచారు. తన వృత్తిని కొనసాగిస్తూనే ప్రజాస్వామిక స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావం నుంచి సీఎం కేసీఆర్ వెంట వుండి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నాటి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి దాకా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను…కర్తవ్య ధీక్షతో నిర్వర్తిస్తూ, పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తున్నారు.

అటు అధినేత విశ్వాసాన్ని ఇటు పార్టీ నేతల అభిమానాన్ని చూరగొంటూ పార్టీకోసం పనిచేస్తున్న సోమా భరత్ కు పార్టీ లో ఓపికస్తుడుగా, సౌమ్యుడిగా పేరుంది. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధినేత సీఎం కేసీఆర్ డైరీ డెవలప్ మెంట్ చైర్మన్ గా నియమించడం పట్ల నాటి ఉద్యమకారుల్లో తెలంగాణ వాదుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమౌతున్నది.

ఇవి కూడా చదవండి..

రేపటితో నోట్లరద్దుకు ఆరేళ్లు:కేటీఆర్‌

కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపిన కూసుకుంట్ల..

కోమటిరెడ్డి బ్రదర్స్ కు తగిన శాస్త్రి

- Advertisement -