- Advertisement -
తెలంగాణలో శుక్రవారం ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలకు వరద పోటెత్తింది. చెరువులు అలుగు పోస్తున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేసింది. గడిచిన 24గంటల్లో హైదరాబాద్‌లో కుండపోత వర్షం కారణంగా ప్రజలు బయటకు రావద్దని ప్రజలకు సూచించింది ఐఎమ్‌డీ.
- Advertisement -