రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో సిటీ సీవీల్ కోర్ట్ అధ్యక్షుడు జెగదీశ్వర్ రావు,కార్యదర్శి జానకి రాములు,అడ్వొకేట్ సొసైటీ సెక్రెటరీ కె.తిరుపతయ్య, అడ్వాకేట్ జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్ధన్ రెడ్డి,అధికారా ప్రాతినిది ఉపేందర్, హోల్డ్ సిటీ న్యాయవాది జేఏసీ మనిక్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు మొక్కలు నాటారు.
. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి న్యాయవాది ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని చెట్ల తెలంగాణను ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారని అన్నారు సిటీ సీవీల్ కోర్ట్ అధ్యక్షుడు జెగదీశ్వర్ రావు. మొక్కలను మనం కాపాడితే ..మొక్కలు మన ప్రాణాన్ని కపడుతాయన్నారు.