తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇస్తామన్న హామీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుండా కొందరికి మాత్రమే దొంగ దారిన భూములు ఇచ్చుకుంటుందని హైకోర్టును ఆశ్రయించారు ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల స్థలం, నెలకు 25,000 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.
ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని, లక్షల మంది ఉద్యమకారులు ఉండగా ఇద్దరికి మాత్రమే దొంగ దారిన ఇచ్చారని హైకోర్టులో పిటిషన్ వేశారు పలువురు తెలంగాణ ఉద్యమకారులు.ఈ హామీల గురించి ప్రభుత్వం ఎక్కడైనా అధికారిక ప్రకటన లేదా ఉత్తర్వులు జారీ చేసిందా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.
దీంతో 2025 మే నెలలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి, ఈ అంశంపై కలెక్టర్ రాసిన లేఖను చూపి ఇద్దరికి 250 గజాల స్థలం, 25,000 పెన్షన్ మంజూరు అయిందని తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఈ లేఖ ఆధారంగా తీర్పు ఇవ్వలేమని, ప్రభుత్వం నుండి స్పష్టమైన జీవో ఉండాలని తెలిపింది హైకోర్టు.
Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్
ఈ అంశంపై అధికారిక వైఖరి తెలపాలి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్ట్.

