తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం..

65
Adilabad-District-Court
- Advertisement -

తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం ప్రారంభంకానుంది. జూన్ 2 నుంచి కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టులు ఏర్పాటుకానున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పది జిల్లాల్లోనే డిస్ట్రిక్ట్‌ కోర్టులు ఉండేవి కానీ ప్రభుత్వం పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాల సంఖ్య 33 కి పెరుగగా
అన్ని జిల్లాల కోర్టులకు జడ్జీలను నియమిస్తూ గతం లోనే ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది.

రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా జూన్‌ 2 వ తేదీన ఉదయం పది గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ జెండాను ఎగుర వేయాలని కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ కోర్టులు కూడా పనిచేయనున్నాయి.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ను గతంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా కలిసి చేసిన వినతి మేరకు కొత్త జిల్లా కోర్టులు ఏర్పాటు అయ్యాయి. న్యాయ చరిత్రలో ఒకేసారి 23 కొత్త జిల్లాల కోర్టులు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటు తో కింది స్థాయిలో కేసుల విచారణ వేగవంతం అవుతుంది. సత్వర న్యాయం జరుగు తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులకు భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. హైకోర్టు కూడా జిల్లాలకు పోర్టు పోలియో జడ్జీలను నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులను ఆయా జిల్లాలకు పోర్టు పోలియో జడ్జీలుగా అపాయింట్ చేసింది.

- Advertisement -