బీజేపీ గాడిన పడడం కష్టమే..?

116
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది బీజేపీలో అంతర్మథనం మరింత పెరుగుతోంది. వర్గపోరు, నేతల మద్య విభేదాలు, టికెట్ల కన్ఫ్యూజన్, ఇక ప్రతీది కూడా పార్టీని పాతాళంలోకి నెట్టేస్తున్నాయి. అధిష్టానం జోక్యం చేసుకొని గాడిన పెట్టేందుకు ఎంత ప్రయత్నిస్తున్న ఫలితం మాత్రం శూన్యం గానే ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగినప్పుడు ఫుల్ యాక్టివ్ గా కనపడిన బండి సంజయ్.. ఆ పదవి కోల్పోగానే డెడ్ స్లో అయ్యారు. అసలు పార్టీలో ఉన్నారా లేరా అనే అనుమానాలు కలిగేలా బండి సైలెంట్ అయ్యారు. మరోవైపు తనకు ప్రదాన్యం దక్కలేదని మొదటి నుంచి అలకబూనుతు వచ్చిన ఈటెల రాజేందర్.. కీలకమైన ప్రచార కమిటీ చైర్మెన్ హోదా లభించినప్పటికి, పార్టీని గాడిన పెట్టడంలో విఫలం అవుతున్నారు. ఇక ఇతర నేతల సంగతి అసలు అగమ్యగోచరంగా ఉంది. .

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, విజయశాంతి వాటి వారు అసలు పార్టీలో కొనసాగుతారా లేదా అనే సందేహాలు సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమౌతున్నాయి. ఇది చాలదన్నట్లు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఇటీవల కొంతమంది గ్రూప్ రాజకీయాలకు కూడా తెర తీశారు. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఇటీవల బీజేపీ నేత వివేక్ ఇంట్లో సమావేశం అయిన సంగతి విధితమే. ఇలా కమలం పార్టీని సొంత నేతలే కుదేలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఎన్నికలకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది.

Also Read:సనాతన ధర్మం అంటే ఇదేనా..మోడీజీ!

ఇప్పటివరకు అభ్యర్థులు కన్ఫమ్ చేయలేదు. అలాగే మేనిఫెస్టో, హామీలు వంటి వాటిపై వాటిపై అసలు దృష్టే సారించలేదు. దీంతో ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసిన కష్టమే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే రాష్టంలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదనే సంగతి అందరికీ తెలిసిందే. పైగా బీజేపీ కాంగ్రెస్ మూకుమ్మడి రాజజకీయాలు ఆ పార్టీని మరింత దెబ్బ తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరగని పెళ్లికి మంగళ వాయిద్యాలు ఎందుకని అనుకున్నట్లు పార్టీని గాలికొదిలేశారు కమలనాథులు. మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీ గాడిన పడడం కష్టమే అంటున్నారు రాజకీయ అతివాదులు.

Also Read:‘గుంటూరు కారం’ పరిస్థితి ఇదీ!

- Advertisement -