మేడారం జాతరకు కేంద్రం నిధులు ఇవ్వాలి

97
- Advertisement -

కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్,పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, పసునురి దయాకర్, శ్రీమతి మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , ఫ్రొఫెసర్ పాండు రంగారావు, టూరిజం శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు బుధవారం రాత్రి కలిసి ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని యూనస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించాడానికి కావాల్సిన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావోచ్చిందని వారు కేంద్ర పర్యాటక సహాయ మంత్రికి తెలిపారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రామప్ప దేవాలయాన్ని యూనెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ స్థలంగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర.. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని వారు కేంద్ర పర్యాటక సహాయక మంత్రిని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కాకతీయ హెరిటేజ్ అనే పుస్తకాన్ని మంత్రికి అందజేశారు.

- Advertisement -