అభివృద్దిలో తెలంగాణ దూసుకుపోతుందిః సీఎం కేసీఆర్

226
kcr tandur
- Advertisement -

.తెలంగాణ‌లో అభివృద్ది దూసుకుపోతుంద‌న్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ఇవాళ రంగారెడ్డి జిల్లా తాండూరు లో నిర్వ‌హించిన‌ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌కు సీఎం కేసీఆర్ హాజ‌ర‌య్యారు. డిసెంబ‌ర్ 7న జ‌రిగే ఎన్నిక‌లు రాష్ట్రానికి అంత్యంత ప్రధాన‌మైన‌వ‌న్నారు. తాజాగా వ‌చ్చిన స‌ర్వేలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంద‌న్నారు. టీఆర్ఎస్ కు 103 నుంచి 105 సీట్లు వ‌స్తాయ‌ని స‌ర్వేలు చెబుతున్నాయ‌న్నారు.

kcr
రాష్ట్రంలో ఆదాయం పెరిగింద‌ని..పెరిగిన ఆదాయాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పంచుతున్నామ‌ని చెప్పారు. ఇసుక స్మగ్లింగ్ ను 50 శాతం అరికడితేనే ఇంత ఆదాయం పెరిగిందని… పూర్తిగా అరికడితే ఇంకెంత ఆదాయం ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. తాండూరులో స్టోన్ కట్టింగ్ ఇండస్ట్రీని స్థాపిస్థామని చెప్పారు. ఆడ‌పిల్ల పెళ్లికి తోడుగా క‌ళ్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చామ‌న్నారు.

kcr

యాదవుల సంక్షేమం కోసం గొర్రెలు పంపిణి చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కేసీఆర్ ను ఢికొట్ట‌డం కాంగ్రెస్ వ‌ల్ల కావ‌డం లేద‌ని అమ‌రావ‌తి నుంచి చంద్ర‌బాబును ర‌ప్పించుకున్నార‌ని కాంగ్రెస్ పార్టీపై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర అభివృద్దికి అడ్డుప‌డ్డ చంద్ర‌బాబు రాష్ట్రానికి వ‌స్తే త‌రిమికొట్టాల‌న్నారు. మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.

- Advertisement -