మొక్కలు నాటడం ఆనందంగా ఉంది :తేజస్విని మనోజ్ఞ

143
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ మానసపుత్రిక అయిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రముఖుల ఈ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటి వాటి ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిస్‌ ఎర్త్‌ ఇండియా 2019 విజేత డా తేజస్విని మనోజ్ఞ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా తేజస్విని మాట్లాడుతూ..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ఒక మొక్కకు ప్రాణం పొయ్యడం చాలా ఆనందంగా ఉంది. నేటి సమాజంలో ఇప్పుడున్న పొల్యూషన్ కి ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాల్సిన భాద్యత మన అందరి మీద ఉంది అన్నారు. సంతోష్ కుమార్ చేపట్టిన ఈ యజ్ఞం భావితరాలకు, సకల జీవులకు లాభదాయకం అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ప్రొఫెసర్ శ్రీనివాస్ శర్మ, ఐఏఎస్‌ గిరిజ శంకర్, నాగరాజు ఎన్‌ఎన్‌ఆర్‌ డ్రీమ్స్ స్కెప్ ఎండీ వీరి ముగ్గురిని ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -