బిగ్ బాస్ హౌజ్ లోకి తేజ‌స్వీ రీఎంట్రీ?

267
Tejaswi-Madivada
- Advertisement -

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిస్తుంది బిగ్ బాస్ షో. మొద‌ట్లో కాస్త డ‌ల్ సాగిన్ బిగ్ బాస్ 2 రెండ‌వ వారంనుంచి చాలా ఆస‌క్తిగా సాగుతుంది. నాని హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ఇంకా పెద్ద మొత్తంలో ఈషోకు ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అయితే పోయిన ఏడాది జ‌రిగిన బిగ్ బాస్ సీజ‌న్ 1 కంటే సిజ‌న్ 2 కొంచెం డ‌ల్ గా సాగుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కంటెస్టెంట్ ల ఎలిమినేష‌న్ తో రోజురోజుకు బిగ్ బాస్ షో పై ఆస‌క్తి పెరుగుతూ వ‌స్తుంది. అయితే రిసెంట్ గా ఎలిమినెట్ అయిన తేజ‌స్వీ ని మ‌ళ్లి బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకోనున్న‌ట్లు స‌మాచారం.

tejaswi-madivada

హౌజ్ లో తేజ‌స్వీ మంచి ఎంటర్ టైన్ మెంట్ ను ఇస్తు ఉండేది. ఆమె ఎలిమినేష‌న్ కు ముఖ్య కార‌ణం సామ్రాట్ తో ల‌వ్ ఎఫైరే తేజ‌స్వీ కొంప‌ముంచింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తేజస్వీ లాంటి యాక్టివ్ ప‌ర్స‌న్ హౌజ్ లో లేక‌పోవ‌డంతో షో డ‌ల్ గా న‌డుస్తుంద‌ని భావించిన బిగ్ బాస్ టీం ఆమెను మ‌ళ్లీ ర‌ప్పించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తుంది. బిగ్ బాస్ కు రేటింగ్ రావడానికి తేజస్వి రోమాంటిక్ యాంగిల్ కూడా ఓ కారణమే అని చెప్పుకోవ‌చ్చు. తేజ‌స్వీ బిగ్ బాస్ ఓ క‌ళ‌ను తీసుకువ‌చ్చార‌ని హోస్ట్ నాని కూడా చెప్పిన విష‌యం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ టీం ప్రోమో ను విడుద‌ల చేసింది.

tejaswi

ఇందులో గ‌డిచిన ఆరువారాల్లో ఆరుగురు కంటెస్టెంట్ లు ఎలిమినెట్ కాగా వారిలో ఒక‌రిని మ‌ళ్లీ హౌజ్ లోకి తీసుకురానున్న‌ట్లు నాని చెప్పిన విష‌యం తెలిసిందే. ఇందులో సంజన – నూతన్ నాయుడు – కిరిటీ దామరాజు – శ్యామల – భానుశ్రీ – తేజస్విలలో ఎవరో ఒకరు ఈ వారం మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎలిమినేట్ అయినా వాళ్లలో తేజ‌స్వీకి ఎక్కువ క్రేజ్ ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఎలిమినెట్ అయిన వాళ్ల‌లో ఓటింగ్ నిర్వ‌హించి ఒక‌రిని హౌజ్ లోకి తీసుకురానున్నారు. ఎలాగైన తేజ‌స్వీనికి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువ‌చ్చేందుకు బిగ్ బాస్ టీం ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.

- Advertisement -