డోస్ పెంచేసిన ‘ఐస్ క్రీం’ భామ..

319
Tejaswi new photo Shoot
- Advertisement -

తెలుగమ్మాయి తేజస్వి మదివాడ చాలా కాలంగా తనకు బ్రేక్ నిచ్చే మూవీ కోసం ఎదురుచూస్తోంది. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా.. తనకు వచ్చిన అన్ని ఆఫర్లన్నింటితోనూ తన  అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది. ఒక వైపు హీరోయిన్ గా చేస్తూ.. మరోవైపు చిన్న చిన్న పాత్రలతో సైతం మెప్పిస్తోంది. బాలీవుడ్ మూవీ హంటర్ రీమేక్ లో నటించిన తేజస్వి … తెలుగులో ఆర్జీవి ఐస్ క్రీం సినిమా తర్వాత తన అందాలను పెద్దగా ఆరబోయలేదు.

తర్వాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వంటి సినిమాలో హీరోయిన్ హెబ్బా పటేల్ కంటే సైడ్ క్యారెక్టర్ చేసిన తేజస్వి చాలా హాటుగా కనిపించింది. అయితే, అది కూడా అంతగా కలిసిరాలేదు. దీంతో మరింత డోస్ పెంచేసిన ఈ అమ్మడు అందాల ఆరబోతతో విశ్వరూపం  చూపించేసిందట.  తన డిజైనర్ టాప్ ను కావల్సినంత కిందకు లాగితే.. అంతగా అన్నట్లు రెచ్చిపోయిందట ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ ఫోటోషూట్ చూసిన  యువకుల మనస్సులు ఎలా జారిపోవడం ఖాయమని ఫ్యాన్స్ వాపోతున్నారు. మరి ఈ రేంజు డోస్ ఇచ్చాక ఇక తెలుగు సినిమాల్లో అమ్మడిని ఏ రేంజులో చూపిస్తారో చూడాలి.

తెలుగులో ఈ మధ్య కాలంలో తెలుగు నేటివ్ హీరోయిన్లు అస్సలు కనిపించట్లేదు. మరి ఈ అందాల ఆరబోతతోనైనా తేజస్వీకి అవకాశాలు కలిసివస్తాయో లేదో వేచిచూడాలి.

- Advertisement -