బీహార్‌లో రైతులకు మద్దతుగా తేజస్వి భారీర్యాలీ..

142
tejaswi yadav
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశరాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనలకు పలు పార్టీలు మద్దతు తెలపగా తాజాగా ఆర్జేడీ బీహార్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది.

బీహార్ రాజ‌ధాని ప‌ట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వ‌హించిన ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా వారితో కలిసి బైఠాయించారు తేజస్వి యాదవ్. కేంద్రం వెంట‌నే రైతు వ్య‌తిరేక వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేసిన తేజస్వి…రైతు వ్య‌తిరేక న‌ల్ల‌చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ‌

- Advertisement -