కథే..నా సినిమాల్లో హీరో

221
- Advertisement -

ఒకప్పుడు ‘చిత్రం’,’జయం’,’నువ్వు నేను’ వంటి ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ ఇటీవల కాలంలో సక్సెస్ రుచి చూడలేకపోయారు. రొటీన్ లవ్ స్టోరీస్‌ కారణంగా వరుస పరాజయాలతో డీలా పడ్డారు. ఇప్పుడు ఈ దర్శకుడు చేసిన కామెంట్లు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్స్ లేరని, తెలుగు నటులకు స్వాతిముత్యం, దంగల్ వంటి సినిమాల్లో నటించేంత కెపాసిటీ లేనేలేదని, అటువంటప్పుడు వారిని స్టార్స్ అని ఎలా అంటామని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందుతున్న మహేష్ బాబు పై తీవ్ర ఆరోపణలు చేశాడు డైరెక్టర్ తేజ.

Teja slams Mahesh Babu

మహేష్ బాబుతో తేజ తెరకెక్కించిన చిత్రం నిజం. ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా అంతగా సక్సెస్ సాధించలేదు. దీనిపై తేజ మాట్లాడుతూ ఈ సినిమా తెరకెక్కించిన సమయంలో మహేష్ బాబుకు బాబీ సినిమా లాంటి డిజాస్టర్ ఉందని, ఆ సమయంలో తనకు జయం, నువ్వు నేను, వంటి చిత్రాలతో హిట్స్ వచ్చాయని, అందుకే తనతో సినిమాకు మహేష్ ఒప్పుకున్నాడని, ఇప్పుడు తనతో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా అని సంచలన వ్యాఖ్యలు చేశాడు తేజ. తన సినిమాల్లో హీరో కథేనని, తాను కథను నమ్ముతానని చెప్పాడు తేజ.

- Advertisement -