జులై 30న హీరో తేజ స‌జ్జా ‘ఇష్క్’..

258
Teja Sajja
- Advertisement -

సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో ‘ఇష్క్‌` చిత్రాన్ని నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే.. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌,ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై30న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తారాగ‌ణం:తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌
సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: య‌స్‌.య‌స్‌. రాజు
నిర్మాత‌లు: ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌.బి. చౌద‌రి
బ్యాన‌ర్‌: మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్‌
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్‌: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌: విఠ‌ల్ కొస‌నం
లిరిక్స్‌: శ్రీ‌మ‌ణి
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్.

- Advertisement -