‘తేజ్ లవ్ యూ’ ఫేర్‌వెల్..

217
Tej I Love you fervol photo
- Advertisement -

తెలుగు తెరపై ఓ మరిచిపోని ప్రేమకథా చిత్రం ‘తొలిప్రేమ’ పవన్ కల్యాణ్ హీరోగా డైరెక్టర్ కరుణాకరన్ ఈ  సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంతో కరుణాకరన్ పేరు ఓ స్థాయిలో మారుమ్రోగింది. ఇంతటి పేరును సొంతం చేసుకున్న ఆయన ఈ తర్వాత చిన్నాచితకా సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు.

 Tej I Love you fervol photo

ఇక ఆయన డైరెక్షన్‌లో చివరిగా వచ్చిన చిత్రం ‘చిన్నదాన నీకోసం’. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ ప్రేమ కథతో ‘తేజు ఐ ల‌వ్ యూ’ అంటూ మనముందుకొస్తున్నాడు. ఇందులో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 29న విడుద‌ల కానుంది.

ఇక తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది సినిమా యూనిట్. ఈ సందర్భంగా అందరూ కలిసి ఓ ఫేర్‌వెల్ ఫోటోకు ఫోజులిచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో అనుపమా మెమోరీ లాస్ పేషెంట్‌గా క‌నిపించ‌నుంద‌ట. ఎప్పుడూ మాస్ సినిమాలతో ప్రేక్షకులను ఆలరించే సాయిధరమ్ తేజ్ ఈసారి కొత్తగా సరికొత్త లవ్ స్టోరీతో మనముందుకురానున్నాడు.

- Advertisement -