- Advertisement -
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. జంతర్ మంతర్ లో ధీక్షకోసం ప్రభుత్వాన్ని, సిఎం పై ఒత్తిడి తేవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరారు ఎమ్మెల్సీ మల్లన్న.
అన్ని పార్టీల నేతలు బిసి బిల్లుకు మద్దతు తెలుపుతామని ప్రకటించారు అని వెల్లడించారు మల్లన్న. బిసిల పట్ల ఆయా పార్టీలు ప్రేమను చాటుకోవాలని కోరాం అని.. అన్ని పార్టీల మద్దతుతో ఈ బిల్లు ఆమోదించాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బిసిలకు 42 శాతం బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాలని అన్ని పార్టీలను కోరుతున్నామని తెలిపారు.
Also Read:రాబిన్ హుడ్..అతిథిగా వార్నర్
- Advertisement -