ఇటీవల వరంగల్‌లో ఓ విద్యార్ధిని పై పెట్రోల్ దాడి జరిగిన విషయం తెలిసిందే.. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ ఉన్మాది రెచ్చిపోయి తోటి విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాడికి పాల్పడ్డ అన్వేష్ అనే యువకుడిని దేహశుద్ధి చేసిన పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసులు ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. మహిళలపై రెచ్చిపోయే ఆకతాయిలకు పోలీసులు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.
వరంగల్‌లో ప్రేమ పేరుతో విద్యార్థినిపై వేధింపులకు పాల్పడుతున్న నిందితుడిపై తోలిసారిగా పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధ్యార్థినులను ప్రేమ పేరుతో యువతులను వేధింపులకు పాల్పడుతున్న కాజీపేట, దర్గా ప్రాంతానికి చెందిన భానోత్ రాకేష్‌పై వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం పీ.డీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేసారు. పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను కాజీపేట స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ సి.హెచ్ అజయ్ కేంద్రకారాగారంలో నిందితుడికి జైలర్ సమక్షంలో పీ.డీ నిర్బంద ఉత్తర్వులను అందజేశారు.
నిందితుడు భానోత్ శంకర్ కాజీపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో విధ్యార్థినులను ప్రేమ పేరుతో వేధించడంతో పాటు మహిళలను లైంగింక వేధింపులకు గురిచేసేవాడు. ఇందులో భాగంగానే 2018 నవంబర్ 11వ తేదిన కాలేజీ విధ్యార్థిని ప్రేమించాలని వెంటబడి వేధించ సంఘటనలో సదరు భాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన కాజీపేట పోలీసులు నిందితుడుని అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడు గతంలోను ఇద్దరు కాలేజీ విద్యార్థినులను ప్రేమ పేరుతో వేధించిన సంఘటనతో పాటు, మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటనలో నిందితుపై కాజీపేట, హన్మకోండ పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేయబడ్డాయని పోలీస్ కమిషనర్ పేర్కోన్నారు.
ఇకపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రేమ, పెళ్ళి పేరుతో వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోజ ఉపేక్షించేది లేదని ఇలాంటి నిందితులు పాల్పడిన నేరాలను కోర్టులో నిరూపించి శిక్షపడే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడంతో వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించడం జరుగుతుందని పోలీసు అధికారులు పేర్కోన్నారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్ళి చేసుకుంటానే సాకుతో వేధింపులకు గురవుతున్న విధ్యార్థినులు మౌనంగా వుండకుండా తమ సమస్యను పోలీస్ అధికారులు లేదా తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకరావల్సిన అవసరం ఎంతైన వుందని. తద్వారా వారిపై చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.