సాంకేతిక రంగం అభివృద్ధితో మహిళలకు, మహిళా పారిశ్రామికవేత్తలకు అపార అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్లు ఇవాంక ట్రంప్ అన్నారు. జీఈఎస్ రెండోరోజు ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన ఇవాంక మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు.
సాంకేతిక విభాగంలో మహిళా పారిశ్రామివేత్తలకు అవకాశాలు ఉన్నాయన్నారు.నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణలన్నీ ప్రైవేటు రంగంలోనే వస్తున్నాయని.. ఏ రంగంలోనైనా సేవలు బాగుంటేనే ఆదరణ ఉంటుందని ఆమె తెలిపారు. స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను మహిళా కోణంలో చూడవద్దని సమాజంలో సగభాగమైన వారి సమస్యలను క్లిష్ట సమస్యలుగా భావించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
చందా కొచ్చర్ మాట్లాడుతూ.. ఐసీఐసీఐ బ్యాంక్ మహిళా వ్యాపారవేత్తలను, మహిళలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. మహిళల కోసం తాము ప్రత్యేక విధానాలను అవలంబిస్తున్నామని, మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిన అవసరముందని అన్నారు. జీఈఎస్‌లో భాగంగా మొత్తం 25 సమావేశాలు జరగరనున్నాయి. వ్యాపార మేలకువలు, నైపుణ్యాల అభివృద్ధి, మహిళల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చ జరగనుంది.
మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనరి జరగగా ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు.ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చర్, డెల్ సీఈవో క్వింటోస్ తదితరులు పాల్గొన్నారు.
#WATCH Live: Ivanka Trump at #GES2017 in Hyderabad https://t.co/rzXldO3VWw
— ANI (@ANI) November 29, 2017