‘లెవెన్’ యూనిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

5
- Advertisement -

నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు.ఈ సినిమా టీజర్ ని హీరో నిఖిల్ ట్విట్టర్ ద్వారా లాంచ్ చేశారు. ”లెవెన్’ టీజర్ చాలా ఎంగెజింగ్ అండ్ స్టన్నింగ్ గా వుంది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” చెప్పారు నిఖిల్.

‘రంజిత్ లాంటి ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని ఎందుకు క్రాక్ చేయలేకపోయాడో ఇప్పుడు అర్ధమౌతోంది’ అంటూ నవీన్ చంద్ర వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ అవుట్ అండ్ అవుట్ ఎంగెజింగ్ గా వుంది. లోకేశ్ అజ్ల్స్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని చాలా యూనిక్ అండ్ గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేశారు. నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. మ్యూజిక్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. లెవెన్ కథ విన్న వెంటనే చాలా బావుందనిపించింది. ఈ సినిమాని తమిళ్, తెలుగు ఒరిజినల్ గా, ఒక షాట్ ని రెండు సార్లు షూట్ చేయడం జరిగింది. ఎనిమిది నెలలు ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ కోసం ఇంత పాషన్ గా పని చేసిన నిర్మాతలని నేను ఇప్పటిదాక చూడలేదు. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఈ సినిమాతో తెలుగులోకి వస్తున్నారు. ఖచ్చితంగా మంచి విజయం అందుకుంటారు. చాలా ఇంటెన్స్ గా క్లియర్ గా తీర్చిదిద్దిన ఈ సినిమా ఇది. బ్యూటీఫుల్ ఫిలిం. ఈ థ్రిల్లర్ ఖచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుంది. రీసెంట్ గా మహారాజ సినిమా చూసి రెండు రోజులు నిద్రపట్టలేదు. అంత ఇంటెన్స్ గా వుంది. ట్విస్ట్ టర్న్స్ స్క్రీన్ ప్లే గురించి ప్రతిఒక్కరూ చాలా బాగా చెప్పారు. అలాగే లెవన్ లో కూడా లాంటి సర్ ప్రైజ్ ఇంటెన్స్ వుంటుంది. కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్, యాక్టింగ్, అన్నీ అద్భుతంగా వుంటాయి. ఈ సినిమా చాలా బావుంటుంది. నా కెరీర్ లో బెస్ట్ థ్రిల్లర్ అవుతుంది. తప్పకుండా సినిమా థియేటర్స్ లో చూడండి’ అని కోరారు

డైరెక్టర్ లోకేశ్ అజ్ల్స్ మాట్లాడుతూ.. ఈ కథ చెప్పినప్పటి నుంచి నిర్మాతలు చాలా బలంగా సపోర్ట్ చేశారు. నవీన్ గారు ది బెస్ట్ ఇచ్చారు. ఇందులో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. మా టెక్నికల్ టీం అంతా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ‘లెవెన్’ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇందులో ఒక యూనిక్ పాయింట్ వుంది. అది మిమల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. టీజర్ లో చూసిన ఎక్సయిట్మెంట్ సినిమాలో వుంటుంది. ఈ టీజర్ ని లాంచ్ చేసిన నిఖిల్ గారికి థాంక్స్’ చెప్పారు.

Also Read:ఆకట్టుకుంటున్న ‘శివం భజే’ టీజర్

- Advertisement -