టీమిండియా సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ప్రోటీస్ జట్టు పట్టు బిగించింది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పై 32 పరుగుల తేడాతో విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ మినహా భారత బ్యాట్స్ మెన్స్ ఎవరు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు కేఎల్ రాహుల్ ఒక్కడే ( 101 ) సెంచరీతో రాణించి గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ఒక ఓవర్ నైట్ స్కోర్ లో ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసిన ప్రోటీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగులకు ఆలౌట్ గా నిలిచింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లలో ఓపెనర్ డీన్ ఎల్గన్ 287 బంతుల్లో 28 ఫోర్లుతో 185 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. ఇక టీమిండియా విషయానికొస్తే రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులకే కుప్పకూలింది..
విరాట్ కోహ్లీ ( 76 ) మాత్రమే రాణించగా మిగిలిన బ్యాట్స్ మెన్స్ అంతా చేతులెత్తేశారు. దీంతో ప్రోటీస్ జట్టు 32 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికా గడ్డపై గతంలో 2010 లో 25 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకున్న టీమిండియా.. మళ్ళీ ఇప్పుడు ఆ రికార్డ్ ను బద్దలు కొడుతూ ఏకంగా 32 పరుగుల తేడాతో ఓడిపోయి చెత్త రికార్డ్ ను మూటగట్టుకుంది. ఇక రెండో టెస్ట్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. మరి రెండో టెస్ట్ లోనైనా విజయం సాధించి టెస్ట్ సిరీస్ ను సమం చేస్తుందా లేదా ఓటమితో నిష్క్రమిస్తుందా అనేది చూడాలి. మొదటి టెస్ట్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లీ ఒకే ఇయర్ లో 2000 కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇయర్ వన్డే టెస్ట్ మ్యాచ్ ల్లో కలిపి మొత్తం 2048 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ ( ఈ ఇయర్ టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు ). మరి రెండో టెస్ట్ మ్యాచ్ లో ఎలా రాణిస్తాడో చూడాలి.
Also Read:నేను మీ బ్రహ్మానందం..ఆత్మకథ పుస్తకం