టీ20 విజేతగా నిలిచింది టీమిండియా. భారత్ విధించిన 177 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 8 వికెట్లు కొల్పోయి 169 పరుగులు చేసింది. దీంతో 7 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. ఓ దశలో దక్షిణాఫ్రికా విజయం ఖాయం అనుకున్న తరుణంలో టీమిండియా బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయం ఖాయమైంది. డికాక్ 39 పరుగులు చేయగా స్టబ్స్ 31,క్లాసెస్ 52,మిల్లర్ 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 2,హర్షదీప్ 2,పాండ్యా 3, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(76) ,అక్షర్ పటేల్(47) పరుగులతో రాణించగా కెప్టెన్ రోహిత్ శర్మ(9), రిషభ్ పంత్(0),సూర్యకుమార్ యాదవ్(3)విఫలమయ్యారు. ఓ దశలో 33 పరుగులకే 3 వికెట్లు కొల్పోయి టీమిండియా తీవ్ర కష్టాల్లో పడగా మరో వికెట్ కొల్పోకుండా జాగ్రత్త పడ్డారు విరాట్, అక్షర్. చివరలో శివమ్ దూబే 27 పరుగులు చేశారు.
Also Read:ప్రోటీన్ లోపాన్ని గుర్తించండిలా!