రోహిత్ సెంచరీ..టీమిండియా గెలుపు

18
- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకుంది టీమిండియా. ఇంగ్లండ్ విధించిన 305 పరుగుల టార్గెట్‌ని భార‌త్ 44.3 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. శుభ్‌మ‌న్ గిల్ 52 బంతుల్లో 60 పరుగులు చేయగా శ్రేయస్‌ అయ్యర్‌ 44 పరుగులు చేశాడు. ఇక కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న రోహిత్ సెంచరీతో రాణించాడు. రోహిత్ 90 బంతుల్లో 7 సిక్స్‌లు, 12 ఫోర్లతో 119 పరుగులు చేశాడు. అక్షర్‌ పటేల్‌ 41 నాటౌట్‌గా నిలవగా ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు, ఆదిల్ ర‌షీద్‌, లియామ్ లివింగ్ స్టోన్‌, గుస్ అట్కిన్సన్‌ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. జో రూట్‌ 69, డకెట్‌ 65,లివింగ్‌స్టన్‌ 41 పరుగులతో రాణించగా ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ (34), హ్యారీ బ్రూక్ (31), ఫిల్ సాల్ట్ (26) పరుగులు చేయగా భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా మూడు వికెట్లు, ష‌మీ, రాణా, పాండ్యా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిలు త‌లా ఓ వికెట్ తీశారు.

Also Read:Delhi:ఖాతా తెరవని కాంగ్రెస్!

- Advertisement -