సెప్టెంబర్ 9 నుండి ఆసియా కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగే ఈ మెగా టోర్నిలో 8 జట్లు పాల్గొననున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుండగా సెప్టెంబర్ 28 న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ టోర్నిలో భారత జట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ముఖ్యంగా యువ ఆటగాళ్ల మధ్య పోటీ గట్టిగా ఉంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ..గత కొంతకాలంగా టీమ్ఇండియా టీ20 జట్టుకు రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు కూడా కావడంతో అతడికి ఆసియా కప్‌లో చోటు దక్కడం చాలా సులభమమే..
ఇక మరో ఆటగాడు హైదరాబాదీ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌రెడ్డి. శివమ్ దూబేతో పోటీ పడుతున్నారు నితీశ్. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో నితీశ్‌కుమార్ రెడ్డి గాయపడగా అతడు గాయం నుంచి కోలుకున్నాడా? లేదా అన్నది తెలియరాలేదు. అలాగే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, ధృవ్ జురెల్ మధ్య పోటీ ఉండటంతో తుది జట్టు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
Also Read:ఎంపీలకు నూతన నివాసాలు

