ఆ టీమ్‌లపై టీమిండియాదే ఆధిపత్యం!

31
- Advertisement -

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుండి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభంకాగా భారత్ ఈ సారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా చాలా బలంగా ఉంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో టాప్‌లో ఉంది టీమిండియా. ఇక ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత ప్రదర్శనను గమనిస్తే దాయాది పాక్‌ పై తిరుగులేని రికార్డు ఉంది.

వన్డే వరల్డ్ కప్‌లో ఇరు జట్లూ ఇప్పటి వరకు ఏడుసార్లు ముఖాముఖి తలపడగా ఒక్కసారి కూడా పాకిస్థాన్ గెలవలేకపోయింది.ఇక శ్రీలంకతో 8 సార్లు తలపడగా చెరో నాలుగు సార్లు విజయం సాధించారు. భారత్ – ఆస్ట్రేలియా జట్లు 12సార్లు ఫేస్ టు ఫేస్ తలపడగా.. ఆస్ట్రేలియా ఎనిమిదిసార్లు విజయం సాధించగా.. భారత్ నాలుగుసార్లు గెలుపొందింది. బంగ్లాదేశ్‌తో భారత్ నాలుగుసార్లు వరల్డ్ కప్‌లో తలపడగా.. మూడుసార్లు మనల్ని విజయం వరించింది.

ఇక ఇంగ్లాండ్‌తో ఏడుసార్లు తలపడగా మూడు సార్ల భారత్‌ గెలుపొందింది. భారత్, కివీస్ 8సార్లు ముఖాముఖి తలపడగా.. న్యూజిలాండ్ జట్టు ఏకంగా ఐదుసార్లు గెలుపొందింది. భారత్ – దక్షిణాఫ్రికా 5 సార్లు తలపడగా రెండుసార్లు ఇండియా గెలిచింది. నెదర్లాండ్స్‌తో ఇప్పటి దాకా రెండు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో తలపడిన ఇండియా.. రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది.

Also Read:కోమటిరెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్…

- Advertisement -