World Cup 2023:టీమిండియా తిరుగులేని ఫామ్!

34
- Advertisement -

వరల్డ్ కప్ లో ప్రస్తుతం టీమిండియా చెలరేగిపోతుంది. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లను మట్టికరిపించిన రోహిత్ సేన నిన్న జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. దీంతో వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. నిన్న జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (66), హాసన్ (51), మహ్మదుల్లా ( 46) రాణించడంతో ఆ మాత్రం స్కోర్ లభించింది. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 41 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మా ఎప్పటిలాగే తన ఫామ్ ను కంటిన్యూ చేశాడు. 40 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ ( 55 బంతుల్లో 53 పరుగులు ), విరాట్ కోహ్లీ వీరోచిత సెంచరీ ( 97 బంతుల్లో 103 పరుగులు ) చెలరేగడంతో టీమిండియా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఈ నెల 22 న న్యూజిలాండ్ తో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి తిరుగులేని జట్టుగా నిలవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇక నేటి వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. మూడు మ్యాచ్ లు ఆడిన పాక్ జట్టు రెండు విజయాలతో నాలుగో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్ లకు గాను ఒక్క విజయం సాధించి ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగు పరచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. మరి ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

Also Read:హెచ్‌సీఏ ఎన్నికలు..సర్వం సిద్ధం

- Advertisement -